Sakhuda divya sakhuda - సఖుడా దివ్య సఖుడా hosanna ministries new album song lyrics 2026

సఖుడా - దివ్య సఖుడా 
ప్రియుడా ప్రాణ ప్రియుడా 
నీతో అనుబంధము కాదే ఈనాటిది 
ఏనాటికి వీడిపోదు - విఖుడా యేసయ్యా 
ఇన్నాళ్లు తీపి జ్ఞాపక పలికే గీతిక 

మౌన రాగమే మధుర గానమై    (2)
మరపురానిదై మదిలో నిలిచేనే 
ఊహించని శోధనలే శృతిలయలు నేర్పినాయి 
పలుశ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి 
ఎకాంత వేళలో - ఏకాంతి లేకున్ననూ 
నా పాదములు జారక - కాపాడే యేసయ్యా 
సద్గుణ రాశివి నీవెనని - స్తుతి మహిమలు చెల్లించెదను 
నిత్యము నిను కీర్తించెదను                              " సఖుడా "

నిండు మనసులో ప్రేమ దీపమై 
మారు మనసుకై సత్య మార్గమై పలికే ప్రేమ నీవై 
నీవు నాతోనున్నావు నా హృదయసీమ నేలే 
మహారాజుగా నిలిచావు నీవు నా ముందుగా 
నడిచే కాపరిగా నా చేయి వీడక నడిపించే యేసయ్య 
సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను   
నిత్యము నిను కీర్తించెదను                            " సఖుడా " 

రమ్యమైనది భాగ్యమైనది 
నిత్యమైనది సరిపోల్చలేనిది    (2) 
నీ మహిమ రాజ్యమందు సియోను శిఖరమందు 
నే పరవశించి పాడే గొప్ప భాగ్యమిచ్చినావు 
నూతనమైనది ఎవరు పాడలేని శ్రేష్ఠమైన గీతం 
నీ పాడేద యేసయ్య - సద్గుణ రాశివి నీవేనని 
స్తుతి మహిమలు చెల్లించెదను 
నిత్యము నిను కీర్తించెదను                            " సఖుడా " 

Comments