పరలోకమే నా స్వస్థ్యము - paralokame na swasthyamu song lyrics | paralogame en sonthame song lyrics
పరలోకమే నా స్వాస్థ్యము
ఎపుడు గాంతునో (2)
నా ప్రియ యేసుని
నే నెపుడు గాంతునో (2) " పరలోకమే "
చరణం 1:
ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట (2)
పరమ మకుటం పొందను ప్రభు్ పదముల చేరేదను (2)
చరణం 2:
సిలువ వేయబడితిని ఇకనే కాదు జీవించుట
ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును (2)
చరణం 3:
నా పరుగు తుదముట్టింప నాకు కృపను మెండుగా
నొసగును విశ్వాస మార్గములో విసుగక పరుగేత్తెదన్ (2)
చరణం 4:
పరమ విశ్రాంతి పొంద పరలోకమందు చేరేదను (2)
పగలు రాత్రచ్చట లేదు ప్రభువే దీపమై యుండును (2)
చరణం 5:
ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను
దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే (2)
Comments