Vennellaa thakali - వెన్నెల్లా తాకాలి lyrics | christian song lyrics
వెన్నల్లా తాకలి - గుండెల్లో ఉండాలి
వెన్నంటే రావాలి - నీ ప్రేమ యేసయ్య
కన్నుల్లో నిండాలి - నీడల్లే సాగాలి
చల్లంగా చూడాలి - నీ ప్రేమ యేసయ్య
ఊహకందని భాషకందని అంతిలేని ప్రేమ
ఎన్నడైననూ ఎప్పుడైనను వీడిపోని ప్రేమ
మధురమైన ప్రేమ
చరణం 1:
ఏడారైన యాత్రలోన విశాదాల బాటలోన
ప్రేమ చూపి ఆదరించే నాదు రక్షకా
ప్రతీచోట ఓటమైన ప్రతి మాట మోసమైన
చేయి చాపి లేపినావు నాదు యేసయ్యా
కల కాని కథలోన - నను నడిపే నిజమైన
నీ ప్రేమేగా " వెన్నెల్లా "
చరణం 2:
లోకమంతా ఏకమైనా కానరాని తీరమైనా
నీదు ప్రేమ చాలు నాకు నాదు యేసయ్య
నిరీక్షించు వేళలోన సదా నన్ను చేరుకున్న
ఎంత గొప్ప ప్రేమ నీది నీతి సూర్యుడా
ఇలలోన బలమైన కథ మార్చే వరమైన
నీ ప్రేమేగా " వెన్నెల్లా "
Comments