Nenemaiyunnano ne krupa song lyrics -నేనేమైయున్నానో నీ కృప Jyothi Raju new song lyrics | arhatha lekunna preminchavu song lyrics
పల్లవి :
అర్హత లేకున్నా ప్రేమించావు
ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నా హెచ్చించావు
ఇది కేవలం నీ కృపయే
కృపయే కృపయే
నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే
నే బ్రతికియున్నానానంటే కృపయే
చరణం 1:
లోకము నన్ను ఆకర్శించగా
అల్లరితరము నా చుట్టు చేరగా
ఓటమి నా బ్రతుకును హేలన చేయగా
నీ కృపతో నన్ను బలపరచితివే (2)
ఇంతగ నన్ను హెచ్చించుటకు
యే పాటి వాడను యేసయ్యా (2)
నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను (2) " కృపయే "
చరణం 2:
శ్రమలు శోధనలు నన్నావరింపగా
అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కోరలు నన్నావరింపగా
నీ కృపతో నన్ను బ్రతికించితివే
ఇంతగా నన్ను ప్రేమించుటకు
యే పాటివాడను యేసయ్యా (2)
నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను (2) " కృపయే "
Comments