నీ చేతి కార్యము - nee chethi karyamu song lyrics | telugu christian songs lyrics
నీ చేతి కార్యము - నాలోన జరిగించు
నీ దివ్య చిత్తము - నాలోన నెరవేర్చు (2)
నీ సన్నిదానము - నిత్యము కనపరచు
నీ వాగ్దానము - నాలోన స్థిరపరచు
యేసయ్యా యేసయ్య - నా బలం నీవయ్యా
ఏ భయం లేదయా - నీ కృప చాలయ్య
నీ దుడ్డు కర్రయు - నీ దివ్య హస్తము
నన్నాదరించును - నన్ను నడిపించును
నా మంచి కాపరి నీ కరుణ కాంతితో
నా జీవితాంతము వెలిగించుము
యేసయ్య యేసయ్య - నా బలం నీవయ్యా
ఏ భయం లేదయ్యా - నీ కృప చాలయ్య
నా శత్రు సైన్యమే నను చుట్టు ముట్టినా
నీ జాలి హృదయమే నన్ను నడిపించును
కన్నీటి ప్రార్ధనే నాకున్న ఆయుధం
నా జయము నీవని స్తుతియింతును
యేసయ్య యేసయ్యా నా బలం నీవయ్యా
ఏ భయం లేదయ్యా నీ కృప చాలయ్యా
ఉన్నత శిఖరముకు - నన్ను నడిపించును
ఎత్తయిన స్థలములపై - నన్ను నిలబెట్టును
నా తోడు నీడగా - నీ వాక్య ధ్యానమే
నా బ్రతుకు బాటను - సరిచేయును
Comments