Na patalo pallavi song lyrics | నా పాటలో పల్లవి thandri sannidhi ministries new song lyrics
పల్లవి :
ఆరాధన నీకే దేవా
ఆనందము నీవే కావా (2)
నా పాటలో పల్లవి ఆశల జల్లువి
నీవేగా నా యేసయ్యా (2) "ఆరాధన నీకే "
చరణం 1:
ఆత్మీయ పోరాటంలో
ఎదురయ్యే ఒడిదుడుకులలో (2)
ఎండబయలేదు క్షణమైన నీవు
ఏ వేళనైనా నను విడిపోవు (2) " నా పాటలో "
చరణం 2:
నా కనుల కన్నీరు తుడిచి
నీ ప్రేమ కౌగిట చేర్చి (2)
అపురూపమైన అనుభవము చూపి
నన్నదరించినా నా యేసయ్యా (2) "నా పాటలో "
చరణం 3:
నాలోన నను తొలగించి
నీ వశములో నన్ను నిలిపి (2)
నాలోన చేరి నా హృదయమేలి
నను వాడుకొనుము నా యేసయ్యా (2) " నా పాటలో "
Comments