Kantipapala kaachinavaya - కంటిపాప లా కాచినావయా song lyrics | telugu christian worship song lyrics

కంటిపాపలా కాచినావయా 
చంటిపాపను మోసినట్లు మోసినావయా 
చేతి నీడలో దాచినావయా 
తోడుగా మా ముందరే నడచినావయా 

పోషించినావయా... బలపరచినావయా - 
భయము వలదని ధైర్యమిచ్చినావయా 
నడిపించినావయా... కాపాడినావయా 
ఓటమంచులో విజయమునిచ్చినావయా 
మా తలంపులు కావు.. నీ తలంపులే 
మా జీవితాలలో జరిగించినావయా 
మా ఊహలే కాదు.. నీ ప్రణాలికే 
మానక సమయానికి నెరవేర్చినావయా           " కంటి పాప " 

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసాముగా
ఆశలే ఆడుయాషలవ్వగా సోలిపోయాముగా 
దారే కానక ఆగిపోయాముగా 
అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా 
అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా 
అణగారిన మా ఆశలన్నీ చిగురింప జేసేగా 
ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచే గా 
చితికిన మా జీవితాలను వెలిగింప జేసేగా 
కన్నీరు తుడిచినావు నాట్యముగా మార్చినావు 
ఎనలేని ప్రేమ మా పైన చూపి...                  " కంటి పాప " 

ఊహించు వాటికంటే ఎంతో అధికముగా 
హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము 
ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై 
దీవించినావు దేవా నీ ప్రేమ మరువము 
హీనులం.. బలహీనులం.. నిలువ లేక పడిపోయిన 
లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా 
చీటికి మాటిమాటికీ మా నమ్మకమే కోల్పోయినా 
అడుగడుగునా నీ నమ్మకత్వమును కనబరచినావుగా 
పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు 
నీ గొప్ప ప్రేమ మాపైన చూపి...                 " కంటి పాప " 

Comments

Popular Posts