Chudalani ledha song lyrics - చూడాలని లేదా song lyrics | telugu christian song lyrics
చూడాలని లేదా నీ దేవుని పట్టణము
పాడాలని లేదా దేవదూతల గీతము
నడవాలని లేదా బంగారు వీధులు
కొలవాలని లేదా యేసుని పాదాలు
ఏ కన్నులు చుడనిది ఏ భాషకు అందనిది
వివరించగ లేనిది ఆ దేవుని రాజ్యము (2)
బంగారు వీధులలో బహు సుందరమైనదట
రతనాల కాంతులతో దగ దగ మెరయునట
పరిశుద్ధ నగరము లో ఆనందము పొంగునట
అందాల ఆ పురిలో ఆకలి ఉండదట
దేవుని మహిమయే వెలుగులు చిందునట
సర్వాధికారియే దీపమై యుండునట (2)
" చూడాలని "
కరువు ఉండదులే కాలము తెలియదులే
శోధనలండవులే వ్యాధులు కానవులే
యేసుని రక్తములే కడగబడిన వారే
దేవుని గ్రంధములో వ్రాయబడిన వారే
ఆ పట్టణమందు నివాసము ఉందురట
యుగయుగముల వరకు రాజ్యము చేతురట (2)
" చూడాలని "
Comments