నిను మాత్రమే నే నమ్మానయ్యా - ninu mathrame ne nammanayya song lyrics
నిను మాత్రమే నే నమ్మానయ్యా
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా
నీ బాహుబలమే నడిపించును
నా స్థితులన్నిటిని సరిచేయును
కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు
నీవు సెలవియ్యగా కలగనీదేముంది
వాక్కును పంపగా జరగనిదేముంది
సకలము నీదేనయ్యా శ్రీమంతుడా
స్తుతి నీకు పాడేదనయ్యా
సమాకూర్చువాడవయ్య నీ పిల్లలకు
నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు
కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు
యుద్ధము నీదేనయా ఓ శూరుడా
ముందుకు సాగేదనయ్యా
జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు
నీవు కరుణించగా కాదనువాడెవడు
సాయము నీదేనయ్య సహాయకుడా
నీలో దాగెదనయ్యా
బలమిచ్చువాడవయ్య నీ పిల్లలకు
Comments