అడిగే వాటికంటే - adige vatikante song lyrics | thandri sannidhi ministries new song lyrics

పల్లవి : 
అడిగే వాటికంటే - ఊహించే వాటికంటే 
అధికముగా చేయగలవు యేసయ్యా 
నన్ను నడిపే సారధివి నీవేనయ్యా        (2) 
నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా                 " అడిగే " 

చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినా 
నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా (2)
అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన (2)
పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన (2)          " అధికముగా " 

అల్పమైన వాటిని ఆశించును నా హృదయం 
అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం (2)
ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం (2)
ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం (2)  " అధికముగా " 

Comments

Popular Posts