రక్షకుని జన్మస్థలమా - rakshakuni janmasthalama song lyrics | hosanna ministries christmas song

రక్షకుని జన్మస్థలమా - యుదయా బేత్లేహేమా (2)
ఆరాధనలకు ఆరంభమా 
హృదయార్పణలకు నివాసమా  (2)
ఎందుకో ఇంత భాగ్యము దాచియుంచే ప్రభు నీ కోసము (2)
స్తుతి మహిమ ప్రభావము ఎల్లవేళలా ప్రభుకే చెందును (2)

చరణం 1: 
ప్రవచించే నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను 
ఆశించే నాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని 
తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియయే ప్రార్ధించగా 
జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా 

చరణం 2:
నోటి మాటతో సృష్టి ని తన చేతులతో 
ఈ మనిషిని చేసిన దేవుడు 
దీనుడై పవళించెను పశువుల పాకలో                           (2)
నీ చరిత్రను మార్చు దేవుడు తన మహిమనే నీకిచ్చెను 
యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైనదానవు కావు (2)
                                                          " స్తుతియు " 
చరణం 3: 
దివిలో దూత గనములు సైన్య సమూహమై దిగువచ్చిరి 
సర్వశక్తి సంపన్నూనికి స్తోత్ర గీతమే అర్పించిరి              (2)
సర్వలోక కల్యాణమునకై లోకాపాప పరిహారముకై 
దిగివచ్చిన యేసు పూజ్యుడని అర్భాటించి కీర్తించేనుగా (2)
                                                         " స్తుతియు " 
చరణం 4:
రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో 
రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు (2)
సింహ సంపన్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెను గా 
శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరి గా (2)
                                                        " స్తుతియు " 

Comments

Popular Posts