నన్ను నీవు మరువక - nannu neevu maruvaka song lyrics
మార్గము తెలిసిన తప్పిపోయాను
ఎటో తెలియక నిలిచిపోయాను
వందమంది కొరకు నీవు పోలేదు
తప్పి పోయిన నన్ను నీవు వెదకి వచ్చావు
నన్ను నీవు మరువక
నన్ను నీవు విడువక
జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు
తృణీకరించక నన్ను త్రోసి వేయక
సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు
చరణం 1:
శ్రేష్టమైన జనులు ఉన్నను
విలువలేని నా కోసం వచ్చావు (2)
నన్ను వెదకుట నీవు ఆపక
నన్ను ప్రేమించుట నీవు మరువక (2)
నూతన ప్రారంభం ఇచ్చావు
నీ భుజములపై నన్ను మోశావు
చరణం 2:
రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో
నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు (2)
నా చేయి పట్టి నన్ను లేపావు
నా మరకలను తుడిచావు (2)
నీ బిడ్డగా నన్ను మార్చివేసావు
నన్ను త్రోసి వేయని తండ్రివి నీవే
Comments