ఈ లోకం మనది కాదు - ee lokam manadhi kadhu song lyrics
ఈ లోకం మనది కాదు
మనతోటి ఏమీ రాదు (2)
ఇది అంతా గాలి మూట
ఇది మనసున పట్టని మాట (2) " ఈ లోకం "
చరణం 1:
మనమెంత కాలమున్నా
ఒకనాడు వెళ్ళాలన్నా (2)
ఆ నాడు ఉందామన్నా
మననుండనీయరన్నా (2) " ఈ లోకం "
చరణం 2:
నీకు భార్య బిడ్డలున్నా
నీకు కొడుకు కోడళ్లున్నా (2)
నిన్నాపలేరోరన్నా
నిన్నాదుకోలేరన్నా (2) " ఈ లోకం "
చరణం 3:
మన తనువు నీటి బుడగ
అది మలసిన మట్టి బొమ్మ (2)
మన తల్లిదండ్రులున్నా
అది అన్నదమ్ములున్నా (2)
నిన్నాపలేరోరన్నా
నిన్నాదుకోలేరన్నా
ఇది అంతా గాలి మూట
ఇది మనసున పట్టని మాట (2) " ఈ లోకం "
Comments