ఏమైనా చేయగలవు - emaina cheyagalavu song lyrics

స్థిరపరచువాడవు బలపరచువాడవు 
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు 
ఘనపరచువాడవు హెచ్చించువాడవు 
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు   (2) 

ఏమైనా చేయగలవు కథమొత్తం మార్చగలవు  
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు      (2) 
యేసయ్యా.. యేసయ్యా.. నీకే నీకే సాధ్యము    (2)

చరణం 1: 
సర్వ కృపానిధి మా పరమ కుమ్మరి 
నీ చేతిలోనే మా జీవమున్నది                         (2) 
మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి 
మా ఊహకు మించిన కార్యాలెన్నో 
జరిగించుచున్నవి                                         (2) 

చరణం 2:
నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా ? 
నీ కంటే దాటగ శత్రువుకు సాధ్యమా              (2) 
మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును 
అపవాది తలచిన కీడులన్నీ 
మేలై పోవును                                            (2) 

Comments

Popular Posts