షారోను రోజావే - sharonu rojave song lyrics | telugu christian song lyrics

షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే 
నిర్దోష రక్తమే - దైవ గొర్రె పిల్లవే 
సుందరుడవు - నీవు సుందరుడవు 
పదివేలలో నీవు శ్రేష్ఠుడవు 
సుందరుడవు - బహు సుందరుడవు 
పదివేలలో అతి శ్రేష్ఠుడవు 

అను పల్లవి : 
హోసన్నా - ఉన్నత దైవమా 
హోసన్నా - దావీదు తనయుడా

చరణం 1: 
స్నేహితులు మరచిపోయినా 
బంధువులే విడిచి పోయినా 
తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే  
సహచరివే సహచరివే 
వేదనలో ఆదరించే నా ప్రియుడవే 

చరణం 2: 
రోగపు పడకలోన - నిరీక్షణ కోల్పోయిన 
నను తాకి స్వస్థ పరచిన వైద్యుడవే 
పరిహారివే - పరిహారివే 
నా వ్యాధులు భరించిన యేసువే 


Comments

Popular Posts