అసమానుడైన వాడు - asamanudaina vaadu song lyrics
అసమానుడైనవాడు - అవమానపరచడు నిన్ను
ఓటమి ఎరుగని మన దేవుడు - ఓడిపోనివ్వడు నిన్ను
ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు
కష్టకాలమందు నీ చేయి విడుచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు
శ్రమలో నిన్ను దాటి పోవునా
సీయోను దేవుడే నిన్ను సిగ్గు పడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును
చరణం 1 :
అగ్ని గుండములో నెట్టి వేసిన
సింహాల నోటికి నిను అప్పగించిన
శత్రువే నీ స్థితి చూసి అతిశయ పడుచున్న
సింహాలే నీ ఎదుట మ్రింగి వేయ నిలిచిన
నాకే ఏల శ్రమలంటూ కృంగి పోకుమా
తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2)
శత్రువు చేతికి నిను అప్పగించడు (2) " సీయోను "
చరణం 2 :
పరిస్థితులన్నీ చేజారి పోయిన
ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమై పోయిన
మంచి రోజులొస్తాయనే నిరీక్షణ లేకున్నా
మారది తలరాతని దిగులు పడకుమా
మారను మధురముగా మార్చును నీకై (2)
మేలులతో నిను తృప్తి పరచును (2) " సీయోను "
చరణం 3 :
ఒంటరి పోరాటం విసుగు రేపినా
పొందిన పిలుపే భారమై పోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగని వారు లేక నిరాశతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకుడిగా
నిలిపినెను నిన్ను (2)
పిలిచిన దేవుడు నిన్ను మరచి పోవునా (2) " సీయోను " "
Comments