హల్లెలూయ అని పాడి స్తుతింపను - halleluya ani paadi sthuthimpanu song lyrics
హల్లెలూయాయని పాడి స్తుతింపను
రారే జనులారా మనసారా ఊరూరా
రారె జనులారా మనసారా నోరారా (2) " హల్లెలూయ"
పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2)
కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2)
తోడు నీడగా నిన్ను కాపాడే నాథుడని (2)
పూజించి ..
పూజించి పాటించి చాటించ రారే " హల్లెలూయ "
బంధుమిత్రులకన్నా బలమైన దేవుడని (2)
అన్నదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని (2)
కన్నాబిడ్డలకన్నా కన్నుల పండుగని (2)
పూజించి ..
పూజించి పాటించి చాటించ రారే " హల్లెలూయ "
రాజాధి రాజుల కన్నా రాజైన దేవుడని (2)
నీచాతి నీచులను ప్రేమింపవచ్చెనని (2)
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)
పూజించి ..
పూజించి పాటించి చాటించ రారే " హల్లెలూయ "
Comments