మనసున్న మంచి దేవా - manasunna manchi deva song lyrics

మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మాలిన మైన నాకై మనిషిగా దిగివచ్చావ (2)
నా మదిని కోవెలగా మలుచుకోవయా 
నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా (2) "మనసున్న"

1) హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము 
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము (2)
    మనసు మర్మమెరిగిన మహనీయుడా 
    మనసు మార్చ గలిగిన నిజ దేవుడా (2)"నా మదిని" 

2) చంచల మనసాడించు బ్రతుకు ఆటను 
    వంచన చేసి నడుపును తప్పు బాటను (2)
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా 
    స్థిరమనస్సుతో నీదారిలో సాగనీవయ్యా " నా మదిని "

3) నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి 
    దీన మనసు తో నీ కడ శిరము వంచితి (2)
    పూర్ణ శాంతి గల వానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా  " నా మదిని " 
    

Comments

Anonymous said…
Deevichave
Anonymous said…
Jesus songs

Popular Posts