ఊహించలేని మేలులతో - uhinchaleni melulatho song lyrics

ఊహించలేని  మేలులతో నింపిన 
నా యేసయ్య నీకే నా వందనం    (2)
వర్ణించ గలనా నీ కార్యముల్
వివరించగలనా  నీ మేలులన్      (2) 

మేలులతో నా హృదయం తృప్తి పరచినావు 
రక్షణ పాత్ర నిచ్చి నిన్ను స్తుతియింతును (2) 
ఇశ్రాయేలు దేవా నా రక్షకా 
స్తుతి యింతును నీ నామమున్  (2)     "ఊహించలేని " 

నా దీన స్థితిని నీవు మార్చినావు 
నా జీవితానికి విలువనిచ్చినావు  (2) 
నీ కృపకు నన్ను ఆహ్వానించి నావు 
నీ సన్నిధి నాకు తోడు నిచ్చినావు (2)  " ఊహించలేని " 
                
.

Comments