త్రియేక దేవుడైన - thriyeka devudaina song lyrics

త్రియేక దేవుడైన యెహోవాను 
కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు (2)
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని 
గాన ప్రతి గానములు చేయుచు ఉండును (2) 

నా శాపము బాపిన రక్షణతో 
నా రోగాల పర్వము ముగిసేనే (2)
వైద్య శాస్త్రములు గ్రహించలేని 
ఆశ్చర్యములెన్నో చేసినావే (2)      " త్రియేక " 

నా నిర్జీవ క్రియలను రూపు మాపిన 
పరిశుద్ధాత్మలో పలించెదనే  (2)
మేఘ మధనములు చేయలేని 
దీవెన వర్షము కురిపించేనే  (2)      "త్రియేక " 

నా స్థితిని మార్చిన స్థుతులతో 
నా హృదముప్పొంగి పొర్లేనే  (2) 
జలాశయములు భరించలేని 
జలప్రళయములను స్తుతి ఆపేనే (2)  " త్రియేక " 






Comments