నీ కృపా నాకు చాలును - ne krupa naku chalunu song lyrics
నీ కృపా నాకు చాలును 
 నీ కృప లేనిది నే బ్రతుకలేను (2)
జలరాసులన్ని ఏకరాశిగా
నిలిచిపోయేనే నీ జనుల ఎదుట (2) 
అవి భూకంపాలే అయినా - ఫెను తుఫానులే అయినా (2)
నీ కృపయే శాసించునా అవి అణగి పోవునా (2)
                                                        " నీ కృపా " 
నా జన్మ భూమి వికటించగా 
మారిపోయేనే మరుభూమి గా  (2) 
నీ కౌగిలే నను దాచేనే - నీ త్యాగమే నను దోచేనే (2) 
నీ కృపయే నిత్యత్వమా నీ త్యాగమే అమరత్వమా (2)
                                                      " నీ కృపా " 
జగదూద్పత్తి కి ముందుగానే 
ఏర్పరచుకుని  నన్ను పిలిచితివా (2)
నీ పిలుపే స్థిర పరిచేనే - నీ కృపయే బలపరిచేనే (2) 
నీ కృపాయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను (2)
                                                       " నీ కృపా " 
Comments