ఇళ్ళలోన పండుగంట - illalona panduganta telugu Christmas song lyrics
పల్లవి :
ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా - చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
ఆ... అర్ధ రాత్రి కాలమందు వెన్నెల.. ఆహా
ఆశ్చర్యకరుడంట వెన్నెల.. ఆహా
జన్మించినాడంట వెన్నెలా
ఈ అవనిలోనంట వెన్నెలా (2) " ఇళ్ళలోన "
చరణం 1:
హా... ఏ ఊరు ఏ వాడ
ఏ దిక్కు పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ.. యూదా దేశమందు వెన్నలా.. ఆహా
బేత్లేహేము పురమునందు వెన్నలా.. ఆహా
రాజులకు రాజంట వెన్నలా
ఆరాజు యేసంట వెన్నెల (2) " ఇళ్ళలోన "
చరణం 2 :
ఆహా తారా చూపు దారిలోనే
వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెలా.. ఆహా..
దర్శింప వచ్చినారు వెన్నెల ఆహా (2)
బంగారు సాంబ్రాణి బోలము
తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల (2) " ఇళ్ళలోన "
చరణం 3:
ఆ.. దివి నుండి ఈ భువికి
వచ్చినాడు ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
పాపులైన మనకోసం వెన్నెల... ఆహా
ప్రాణాన్ని అర్పించి వెన్నెల... ఆహా (2)
పరలోకానికి మార్గం వెన్నెలా
ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) " ఇళ్ళలోన "
చరణం 3:
పరలోకం చేరుటకు
నేనేమి చేయాలి వెన్నెల
చెప్పవే చెప్పవే కోయిలా (2)
యేసయ్యను నమ్ముకో వెన్నెల.. ఆహా
పాపాలను ఒప్పుకో వెన్నల.. ఆహా (2)
కొత్తగా జన్మించు వెన్నెలా
రక్షణను పొందుకో వెన్నెలా (2) " ఇళ్ళలోన "
Comments