కన్నీళ్ళే కీర్తనలాయే - kanneelle keerthanalaaye latest christian song lyrics

పల్లవి :
కన్నీళ్ళే కీర్తనలాయే గాయాలే గానాలాయే 
కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు 
మారని దేవా మహోన్నత ఇదియే మా కృతజ్ఞత  (2)
ఎలా తీర్చగలను nee రుణమును  (2)                   " కన్నీళ్ళే "

చరణం 1:
అర్హతే  లేని నాపై అంతులేని కృపను చూపి 
ప్రేమతో పిలిచితివి తండ్రివై మోసితివి   (2)
నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి  (2)
నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు (2)      " కన్నీళ్ళే " 

చరణం 2: 
నే చూడని యుద్ధాలు నీవే పోరాడితివి 
తెలియని ఆపదనుండి నీవే కాపాడితివి   (2)
నేనడగని దీవెనలు మెండుగా నొసగితివి  (2) 
నాదు బలహీనతకంటే కృపయే బలమైనది  (2)   " కన్నీళ్ళే " 

చరణం 3:
వాగ్ధనాములనిచ్చి జీవాలయము కట్టి 
నీ స్పర్శ తాకిన వారే సాక్షులుగా నిలిచినారే  (2)
నీదు సమృద్ధి చేత పోషించుచున్నావే (2)
మా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2)             " కన్నీళ్ళే " 

చరణం 4:
మహిమయే లేని చోట మహిమను రప్పించినావే 
ఇంతవరకు సహాయకుడవై ఎబినేజరువైనావే (2)
గొర్రె పిల్ల రక్తముతో మా కథనే రాసావే (2)
నీ పిలుపు మారదు ఎన్నడూ ఓడిపోదు (2)       " కన్నీళ్ళే "

Comments

Popular Posts