Stuthi keerthaneeyuda song lyrics - స్తుతికీర్తనీయుడా song lyrics | hosanna ministries new songs 2026

స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ 
నా హృదయ వీణపై శృతి చేసి పాడనా 
నా యేసు రాజా అనురాగ బంధమా
నన్ను విడువలేని ఆత్మ అనుబంధమా      (2)

చరణం 1:
నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమా
నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా     (2)
నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును 
ఇలలోన నీకై సాక్షిగా జీవింతును             (2)     " నా యేసు "

చరణం 2: 
నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా 
నీ వెలుగు జాడలలో నిను వెంబడించగా   (2)
నీ జీవ వాక్యం నింపెనే నాలో ధైర్యము 
ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం       (2)   " నా యేసు "

చరణం3:
మహిమ సింహాసనం నే చేరాలనే 
నే కన్న కలలన్నీ నిజమైన వేళలో             (2) 
నా జయమై నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన 
నీలోన లీనమై పోదునే నిరంతరము         (2)   " నా యేసు " 

Comments

Popular Posts