Manasa maruvaku - మనసా మరువకు song lyrics | thandri sannidhi ministries new album song lyrics

మనసా మరువకు యేసుని రాకడ?
ఉండదు మనుగడ (2)
సిద్ధపాటు విస్మయించకు 
సిగ్గుపడే రోజు చూడకు 

చరణం 1 :
రాజ్యముపై రాజ్యము లేచును కాయం 
అక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం         (2)
యేసు వార్త దిగంతాలు చేరును సత్యం        (2)
విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం       (2)

చరణం 2 : 
చిన్న కొమ్ము రాజై ఏలును లోకం 
వాని కాళ్ళు మొక్కి నోళ్లు పొందును భోగం    (2)
నజరేయుని సంఘం పై చూపును ద్వేషం      (2)
పరిశుద్ధుల గెలుచునట్లు చేయును యుద్ధం   (2)

చరణం 3 :
ఎదురించిన సంఘం పై దుష్టని కోపం 
తన వారిని రక్షించును దేవుని హస్తం            (2)
శ్రమల చేత భక్తులవును శుద్ధ సువర్ణం          (2)
ఆ మీదట ఎత్త బడును యేసుని సంఘం      (2)

Comments

Popular Posts