రాజాధిరాజుగా - raajadhi rajuga song lyrics
పల్లవి :
రాజాధి రాజుగా లోకాన జ్యోతిగా పుట్టాడు నా యేసయ్యా
కనులారా చూడగా రారండి వేడగా వచ్చాడు నా మెస్సయ్యా
దేవాది దేవుడే ఈనాడే దీనుడై పుట్టాడు నీ కోసమే
ఈ గొప్ప కానుక సంతోష వేడుక చెయ్యాలి ఆర్భాటమే
నిన్ను కాపాడగా ప్రేమ చూపించగా మన ప్రభుయేసు ఉదయించేనే
నిను రక్షించగా ఇల దీవించగా ఈ పుడమందు జనియించేనే
నిను కరునించ అరుదేంచేనే
చరణం 1:
ఆకాశాన ఆనందాలే పలికెను ఈ రేయిలో యేసే పుట్టాడని
ఊరు వాడ పొంగిపోయే నేడే ఓ సంబరం
మెరిసే తార - దారే చూపి - చేసే ఆడంబరం
ఉరకలు వేసి యేసుని చూడవచ్చే గొల్లలు
దరువులు వేసి చాటారండీ శుభవార్తను
శిశువుని చూసి ఆరాధించి పాడే దూతలు
కానుకలిచ్చి వేడారండి ఆ జ్ఞానులు
పుట్టారండీ పూజించండి పసిబాలుని
మా రాజు నీవేనని మా రారాజు నీవేనని " రాజాధి "
చరణం 2:
క్రీస్తే జీవం ఆశా దీపం వెలిసెను నీ తోడుగా
ఇమ్మానుయేలుగా
మంచే లేని ఈ లోకాన నీకై దిగి వచ్చేనే
మహిమే వీడి - మనసే కోరి - నీలో వసియించేనే
వెలుగును నింపే సూరీడల్లే వచ్చాడేసయ్యా
మమతలు పంచె చంద్రునిమల్లె చేరాడయ్యా
కలతను బాపి నెమ్మదినిచ్చి కాచే దేవుడు
కపటము లేని దయగల వాడే నా దేవుడు
పుట్టాదండీ పూజించండి ప్రభు యేసుని
మా రాజు నీవేనని మా రారాజు నీవేనని " రాజాధి "
Comments