తలుచుకుంటె చాలును - thaluchukunte chalunu song lyrics
తలుచుకుంటే చాలును ఓ యేసు నీ ప్రేమ 
జల జల జల పారును కృతజ్ఞతా కన్నీళ్లు 
తలచుకుంటే చాలును కరిగించును రాళ్ళను 
కల్వరి స్వరము - ఇది కల్వరి స్వరము              " తలచుకుంటే "
నీ మోమున ఊసిన ఉమ్ములు 
నా మోహపు చూపు తుడిచెను 
నీ చెంపను కొట్టిన దెబ్బలు 
నా నోటిని శుద్ధి చేసెను               (2)
నీ శిరస్సున గుచ్చిన ముండ్లు 
నా మోసపు తలపును త్రుంచెను (2)
ఎంత త్యాగ పూరితమో నీ ప్రేమా 
ఎంత క్షమాభరితమో నీ ప్రేమ                         " తలచుకుంటే "
నీ దేహము చేరిన కొరడా 
నా కామమును చీల్చెను 
నీ చేతుల కాళ్ళకు మేకులు 
నా చీకటి దారులు మూసెను  (2) 
సిలువ నెత్తుటి ధారలు 
నా కలుషములు కడిగి వేసెను (2) 
ఎంత త్యాగ పూరితమో నీ ప్రేమ 
ఎంత క్షమా భరితమో నీ ప్రేమ                       " తలచుకుంటే " 
Comments