నా చేరువై నా యేసయ్య - na cheruvai na snehamai song lyrics

నా చేరువై నా స్నేహమై 
నను ప్రేమించే నా యేసయ్య 

నీ ప్రేమ లోనే నే నుండిపోని 
నీ సేవ లోనే నను సాగని 
నీ ధ్యాసలోనే మైమరచి పోనీ 
నీ వాక్కు నాలో నెరవేరని 
నా వరం నా బలం నీవే నా గానం 
నా ధనం నా ఘనం నేవే ఆనందం 
తోడుగా నీడగా నీవే నా దైవం 
ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం 

1)
నా వేదనందు - నా గాయమందు 
నిను చేరుకున్నా - నా యేసయ్యా 
నీ చారణమందు - నీ ధ్యాన మందు 
నిను కోరుకున్నా నీ ప్రేమకై 
కరుణించి నావు నను పిలిచినావు 
గమనించినావు ఘన పరచినావు 
నీవే గా దేవా నా ఊపిరి 

2)
నా జీవితాన - ఏ భారమైన 
నీ జాలి హృదయం - లాలించెనే 
ప్రతికూల మైన - ఏ ప్రళయమైన 
ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య 
విలువైన ప్రేమ కనపరిచినావు 
బలపరచి నన్ను గెలిపించినావు 
నీవే గా దేవా నా ఊపిరి 

Comments

Anonymous said…
Good 👍

Popular Posts