భూమ్యాకాశములను సృజించిన - bhumyakashamulanu srujinchina song lyrics

భూమ్యాకాశములను సృజించిన దేవా 
నీ సన్నిధిలోనే ప్రకాశించెదను 
నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు
నీ పూర్ణతలో నన్ను నడిపించుము 
మహిమా నీకే .. ఘనతా నీకే .. 
ప్రతి దినం నా ఆరాధన నీకే 
మహిమా నీకే ఘనతా నీకే .. 
నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే 
యేసయ్య నీకే వందనం (4) 

మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు 
వట్టి వాడనైనా గాని మహిమతో నను నింపావు (2) 
నీ కౌగిలిలో నను హత్తుకొని 
అర చేతులలో నను చెక్కుకుని 
నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింప చేశావు (2) 
ఏమివ్వగలను నేను నీ ప్రేమకై 
పగిలిన నా హృదయముతో ఆరాధింతును  " మహిమ " 

ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు 
సిలువ పైన ప్రాణ మిచ్చి వింతగా నను మార్చావు (2)
నా మనో నేత్రమును వెలిగించి 
నా హృదయ కాఠిన్యమును మార్చి 
అర్హత లేని బలహీనడనే ఎన్నుకున్నావు  (2)
ఏమిచ్చి నీ రుణం నే తీర్తును 
విరిగి నలిగిన మనసుతో ఆరాధింతును (2)   " మహిమ " 


Comments