Najarethuvada na prananadha song lyrics | thandri sannidhi new album songs lyrics | నజరేతువాడా నా ప్రాణ నాథా song lyrics

పల్లవి :
నజరేతువాడా నా ప్రాణ నాథా 
నా విమోచకా విశ్వ పరిపాలకా   (2)
రక్షకా యేసయ్యా.. 
యేసయ్యా నా రక్షకా   (2)                    " నజరేతు " 

చరణం 1:
గగనాలు భువనాలు నీ చేతి పనులే 
నా జీవిత గమనాలు నీ చిత్తములే    (2) 
నా కథలో మలుపులన్నీ నీ విధితములే (2)
నను మాలచగా చేసినావు నీ చిత్తములే  (2)      " రక్షకా "

చరణం 2: 
నా కార్యములన్నీ కలత కారణములే 
నీ మార్గములన్నీ క్షేమ కారణములే  (2) 
నీ హస్తములే నన్ను గెలువనీ (2)
నీ చేతులలో నన్ను ఓడిపోనీ (2)                      " రక్షకా "

చరణం 3: 
పూజ్యులన్న వారు నీకు సాటి రారు 
నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించి లేరు (2)
అర్షడ్వర్గములన్నిటిని అధిగమించిన (2)
అతి శ్రేష్టుడా నీకే ఆరాధన... (2)                      " రక్షకా " 

Comments

Popular Posts